హైదరాబాద్ టూ కేరళ.. తక్కువ ధరలోనే అద్దిరిపోయే ప్యాకేజీ..!
దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఏదైనా టూర్ వెళ్దామా..? అనే ఆలోచన వచ్చినప్పుడు మొదటగా గుర్తొచ్చే ప్రదేశం కేరళ.. కేరళ అందాలను మాటల్లో చెప్పాలంటే కష్టం.. ఆ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను తనివితీరా ఆస్వాదించాల్సిందే. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. కాస్త విరామం దొరికినా చాలా మంది కేరళను క్యూ కడుతుంటారు. దానికి కారణం ఇక్కడి పచ్చని కొండలు, ప్రకృతి అందాలు, ఎటు చూసినా సెలయేర్లు, నదులు ఉండటమే.. హైదరాబాద్ లో బిజీ లైఫ్ ను గడిపే వాళ్లకు కేరళ టూర్ మంచి రీఫ్రెష్ మెంట్.. నగరాల్లోని రద్దీ, ట్రాఫిక్, ఆ రణగొణధ్వనులు ఇక్కడ ఉండవు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం నగరవాసులను ఆకట్టుకుంటోంది.
ఇక ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సీజన్ లో కేరళ టూర్ కు వెళ్తే ఆ కిక్కే వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో కేరళను సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ టూరిజం కేరళ మాన్సూన్ మ్యాజిక్ టూర్ పేరుతో ఓ అద్బుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ టూర్ లో భాగంగా పర్యాటకులు కొచ్చి, గురువాయుర్, మున్నార్, కుమారకం అలాగే తిరువనంతపురం ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
ఈ ఫ్లైట్ టూర్ ఆగస్టు 3, 2026 నుంచి ప్రారంభం కానుంది. కేరళ టూర్ లో భాగంగా టూరిస్టులు మొదట హైదరాబాద్ నుంచి కొచ్చి కి విమానంలో బయలుదేరుతారు. అక్కడే హోటల్ లో బస చేసిన తర్వాత డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్ ను సందర్శిస్తారు. ఇక రాత్రి కొచ్చిలో బస ఉంటుంది. రెండోరోజు అత్తిరపల్లి వాటర్ ఫాల్స్, గురువాయూర్ లోని శ్రీ కృష్ణ టెంపుల్ తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత మూడోరోజు మున్నార్ కు వెళ్తారు. మున్నార్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. టీ తోటలు, జలపాతాలు, వ్యూ పాయింట్లు, ఇతర ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ రాత్రికి మున్నార్ లోనే హౌజ్ బోట్ లో బస ఉంటుంది. ఇది ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇక ఆరో రోజు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని హైదరాబాద్ కు తిరిగి ఫ్లైట్ లో చేరుకుంటారు. దాంతో ఈ టూర్ ముగుస్తుంది. మీరూ ఓ సారి కేరళ ట్రిప్ కు వెళ్లిరండి..












Click it and Unblock the Notifications