టీటీడీ కళ్యాణమస్తు తాత్కాలిక వాయిదా: బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనం మాత్రమే

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో ఆదివారం జరగాల్సిన సామూహిక వివాహాల కార్యక్రమం కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా పడింది. పేద హిందువులకు వివాహం భారం కాకూడదనే నిర్ణయంతో టీటీడీ ఈ పథకాన్ని 2007లో ప్రవేశ పెట్టి 2011 వరకు నిర్వహించింది. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ పథకాన్ని ఆపివేశారు.

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమాన్ని పునురుధ్దరించే ప్రయత్నంలో భాగంగా టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రకటించింది. శ్రావణశుధ్ద దశమి ఆదివారం ఆగస్టు 7వ తేదీ ఉదయం 08.07 నిమిషాలకు వివాహాలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవటంతో టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.

 TTD Kalyanamasthu temporarily postponed: only sarva darshan for brahmotsavam

ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తిరిగి టీటీడీ కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే చాలామంది సామూహిక వివాహాలకు జిల్లా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, కళ్యాణమస్తు వాయిదాపై టీటీడీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే మరో ముహూర్తం నిర్ణయించి కళ్యాణమస్తును నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనం మాత్రమే

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ అనంతరం రెండేళ్ల తరువాత స్వామివారి మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 27న బ్రహ్మోత్సవాలకు తోడు, పెరటాసీ మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రతీ యేటా బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ రద్దు చేస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి ఒక్కరికి సర్వదర్శనం మాత్రమే కల్పించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+