TTD అరుదైన అవకాశం- ఒకే టికెట్ పై మూడు రోజులు శ్రీవారి దర్శనం, ఇలా పొందండి..!!

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అలిపిరి కాలినడక మార్గంలో విస్తరణ పనులు మొదలయ్యాయి. కొండ మీదకు వాహనాల సంఖ్య తగ్గించేందుకు కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం కల్పించింది. ఒకే టికెట్ పైన మూడు రోజుల పాటు శ్రీవారిని దర్శించుకునేలా నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అప్డేట్ ఇచ్చింది. శ్రీవారిని ఒకే టికెట్ పైన మూడు రోజులు దర్శించు కొనే అవకాశం కల్పించింది. స్వామి వారి పవిత్రోత్సవాల వేళ ఈ అవకాశం దక్కనుంది. శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించే లా నిర్ణయించారు. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు.. సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగు తాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు భంగా కలగకుండా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సేవాలో పాల్గొనాలని భావించే భక్తులకు టీటీడీ ఈ నె 21వ తేదీన ప్రత్యేకంగా టికెట్లను ఆన్ లైన్ లో జారీ చేయనుంది.

రుతుపవనాలు వచ్చేసాయ్, మొదలైన వర్షాలు- మనకు ఈ తేదీల్లో..!!
రుతుపవనాలు వచ్చేసాయ్, మొదలైన వర్షాలు- మనకు ఈ తేదీల్లో..!!
ttd-latest-decision-over-providing-three-days-sri-vari-darshan-with-single-ticket-during-pavitrotsa

పవిత్రోత్సవాల వేళ ప్రత్యేకంగా

21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసే టికెట్ ను ఇద్దరికీ కలిపి రూ 5,000 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపన తిరుమంజనంలో.. చివరి రోజున పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించారు. అదే విధంగా పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7 గంటలకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1 వద్దకు చేరుకని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును చూపటం ద్వారా అనుమతిస్తారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు వరుసగా మూడు రోజులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండటం తో.. పెద్ద సంఖ్యలో భక్తులు సద్వినియోగం చేసుకుంటారని టీటీడీ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+