TTD: శ్రీవారి దర్శనం స్లాట్లు - ప్రసాదం పంపిణీలో కీలక మార్పులు..!!

Tirumala: తిరుమలలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈవో ధర్మారెడ్డిని తప్పించి శ్యామలా రావును నియమించారు. టీటీడీ ఛైర్మన్..కొత్త బోర్డు పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్ల దర్శన స్లాట్స్..ప్రసాదం పంపిణీ పై కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ గుడ్ న్యూస్
టీటీడీ సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్‌ స్లాట్స్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. దర్శానికి వెళ్లే వృద్ధులు తమ ఫొటో ఐడీకార్డులు (ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లు)తో వయస్సు రుజువులను ఎస్-1 కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుంది. వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా, మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా బయట గ్యాలరీ నుంచి ప్రవేశం కల్పించనున్నది. వారి కోసం సీటింగ్‌ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకురానున్నది.

TTD latest Decisions over Senior citizens Darshan slots and Prasadam Distribution in Tirumala

వృద్ధుల దర్శన స్లాట్లు
అదే సమయంలో క్యూలైన్లలో వృద్ధులకు సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు సైతం అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి. వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు సైతం అందించనున్నారు. కేవలం రూ.20 చెల్లించి రెండు లడ్డూలు పొందే అవకాశం ఇస్తున్నది. అదనంగా లడ్డూల కోసం ఒక్కో దానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్త బోర్డుపై కసరత్తు
ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే వృద్ధులు శ్రీవారి దర్శనం చేసుకోనేలా వీలు కల్పించనున్నది. వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08772277777 ను సంప్రదించాలని సూచించింది. మరో రెండు రోజుల్లో టీటీడీకి నూతన ఛైర్మన్ ను నియమించనున్నారు. అదే విధంగా బోర్డు విషయంలోనూ చంద్రబాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కొత్త ఛైర్మన్ నియామకం తరువాత అవసరమైన మార్పులు ఉంటాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+