TTD: భక్తులకు టీటీడీ భారీ రిలీఫ్ - అద్దెలు తగ్గింపు, మార్గదర్శకాలు..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీ భక్తుల సౌకర్యాల పెంపు కోసం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అలిపిరి నుంచి తిరుమల వరకు ఆధ్యాత్మిక వాతావరణం పెంచేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీటీడీ.. కొత్తగా వసతి విషయంలోనూ కార్యాచరణ ఖరారు చేస్తోంది. తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న వసతి గృహాలను ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు రిలీఫ్ ఇస్తూ ధరలు తగ్గింపు దిశగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

తిరుమలలో ప్రయివేటు హోటళ్లు భక్తులకు భారంగా మారుతున్నాయి. అద్దెతో పాటుగా అన్ని రకాలుగా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తిరుమలలో టీటీడీ నిర్వహించే వసతి గృహాల్లో కొత్త విధానం తెచ్చి అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే సమయంలో ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తు న్న అద్దెలను తగ్గిస్తూ టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. వాటి టెండర్ల కాలపరిమితిని ఇప్పటి వరకు ఉన్న మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచింది. కొత్తగా ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండరుదారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, పది హోటళ్లను నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించింది.

ttd-latest-guide-lines-for-hotels-in-tirumala-invites-new-tenders

ఇదే సమయంలో హోటళ్ల అద్దెను తగ్గిస్తూ తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది. ఈ నెల 23న ప్రారంభమైన ఈ టెండరు ప్రక్రియ జూలై 19వ తేదీన ముగుస్తుంది. కొత్తగా ధరలను ఖరారు చేసారు. నెలకు రూ.12.99 లక్షలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను రూ.9.75 లక్షలకు తగ్గించగా,కౌస్తుభం హోటల్‌ అద్దె రూ.16.20 లక్షల నుంచి 12.15 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్‌కు రూ.5.05 లక్షల అద్దెను రూ.3.80 లక్షలు, పీఏసీ(నార్త్‌)కు రూ.4.10 లక్షలను రూ.3.10 లక్షలకు, హెచ్‌వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పీఏసీ (వెస్ట్)కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు, ఎస్‌ఎంసీ క్యాంటీన్‌కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత అధికారికంగా వీటి పైన ప్రకటన చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+