TTD: వేసవిలో వారి సిఫారసు లేఖలు రద్దు - దర్శనాల్లో తాజా మార్పులు..!!
Tirumala: తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త సంవత్సరం ప్రారంభ వేళ ఉగాది ఆస్థానానికి సిద్దమవుతోంది. వేసవి రద్దీ క్రమేణా పెరుగుతోంది. ఇదే సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్రేక్ దర్శనాలను కుదించాల ని నిర్ణయించారు. ఇక, సిఫార్సు లేఖల ఆమోదం విషయంలోనూ రేపటి (ఏప్రిల్ 1) నుంచి మూడు నెలల పాటు కీలక నిర్ణయాలు అమలు చేయనున్నారు.
కొనసాగుతున్న రద్దీ
వేసవి కావటంతో తిరుమలలో రద్దీ క్రమేణా పెరుగుతోంది. ఉగాది.. వరుస సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం శ్రీవారిని 65,569 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

బ్రేక్ దర్శనాల కుదింపు
ప్రతీ ఏటా వేసవి రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాల ని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలను కుదించే లా నిర్ణయం వెల్లడించేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించడం కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వీఐపీ బ్రేక్ దర్శనాలు నాలుగు వేలు, శ్రీవాణి 1500, దాతలు, వర్చువల్ ఎస్‌ఈడీల దర్శనాలు దాదాపు ఐదు వేల వరకు టికెట్లను ఇస్తున్నారు.
వారి లేఖలు రద్దు
ఈ సమయంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయానికి సిద్దమైంది. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు దర్శించుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో.. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయనున్నారని తెలుస్తోంది. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశం పైన టీటీడీ ప్రభుత్వా నికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకే రద్దు చేయకుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications