తిరుమలలో గరుడసేవ, టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఇవే, ఘాట్ రోడ్లలో బ్యాన్ బ్రదర్, శ్రీవారి!
తిరుమల/తిరుపతి: తిరుమలలో (Tirumala)నవరాత్రి బ్రహ్మోత్సవాలలో (brahmotsavam) భాగంగా అక్టోబరు 19వ తేదీన గరుడసేవ (Garudaseva) రోజున అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ (TTD) సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.
తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో బుధవారం మీడియా సమావేశంలో టీటీడీ (TTD) సీవీఎస్వో నరసింహ కిశోర్ మాట్లాడుతూ విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహనసేవ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. గ్యాలరీలు నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోని కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అనుమతించి గరుడ వాహనం (Garudaseva)దర్శనం కల్పిస్తామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ చెప్పారు.

రాంభగీచా ప్రధాన మార్గం నుండి వాహన మండపం వరకు వీఐపీలందరూ నడిచి వెళ్లాల్సి ఉంటుందని, వీరి కోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ (TTD) సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. గరుడసేవ (Garudaseva) రోజున వీఐపీలు కూడా సహకరించాలని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ కోరారు. అక్టోబరు 19న ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, ఉద్యోగుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశామని, అన్నప్రసాద వితరణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, మొబైల్, లగేజీ డిపాజిట్, డెలివరీ కోసం లగేజీ కేంద్రాలు ఏర్పాటు చేశామని టీటీడీ (TTD) సీవీఎస్వో నరసింహ కిషోర్ చెప్పారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా అక్టోబర్ 19వ తేదీన గురువారం నాడు జరగనున్న గరుడ సేవకు (Garudaseva) విశేషంగా విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ (TTD) క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జీఎల్ఎన్.శాస్త్రీ తెలిపారు. తిరుమల (Tirumala)అన్నమయ్య భవనంలో బుధవారం మీడియాతో జీఎల్ఎన్. శాస్త్రీ మాట్లాడారు.

ఈ సందర్భంగా జీఎల్ఎన్.శాస్త్రీ మాట్లాడుతూ గరుడ సేవ (Garudaseva) దర్శనం కోసం బుధవారం రాత్రి నుండి గ్యాలరీల్లో భక్తులు వేచి ఉంటారని వీరికి వేడిగా పాలు అందిస్తామని తెలిపారు. గరుడసేవ (Garudaseva) సందర్బంగా గురువారం ఉదయం 5 గంటల నుండి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామని జీఎల్ఎన్.శాస్త్రీ అన్నారు. ఉదయం 5 గంటలకు కాఫీ, పాలు, ఉదయం 6.30 గంటల నుండి 10 గంటల వరకు ఉప్మా లేదా పొంగలి అందిస్తామని జీఎల్ఎన్.శాస్త్రీ తెలిపారు.
గరుడసేవ (Garudaseva) సందర్బంగా గురువారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు 2. 75 లక్షల మందికి మజ్జిగ, మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు 14 రకాల కూరగాయలతో బిసిబేలా బాత్, చక్కెర పొంగలి అందిస్తామని జీఎల్ఎన్.శాస్త్రీ అన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు పులిహోర ప్యాకెట్లు, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సుండలు, పాలు, కాఫీ అందజేస్తామని టీటీడీ (TTD) అధికారి జీఎల్ఎన్.శాస్త్రీ తెలిపారు.
12 వాహనాలు, 150 ట్రాలీలు, 363 మంది అదనపు సిబ్బంది, 830 మంది శ్రీవారి సేవకులతో (Garudaseva) గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని జీఎల్ఎన్.శాస్త్రీ అన్నారు. అదే విధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్న ప్రసాదం భవనంలో శ్రీవెంకటేశ్వరస్వామి (Garudaseva)భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని జీఎల్ఎన్.శాస్త్రీ వివరించారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications