TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలలో ప్రత్యేకతలు, టోల్ ఫ్రీ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా మొదలైనాయి. శ్రీవారు బ్రహ్మోత్సవాలను కళ్లారా చూడడానికి లక్షలాదిమంది శ్రీవారి భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఎంతో ముఖ్యమైన గరుడసేవను చూడటానికి లక్షలాది మంది తిరుమల చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడటానికి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వెలుతున్న వృద్ధులు, చిన్నారులు తప్పిపోకుండా టీటీడీ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వృద్ధులకు, చిన్నారులకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఒకవేళ వృద్ధులు, చిన్నారులు తప్పిపోయినా వారిని సులభంగా గుర్తించి వారి కుటుంబ సభ్యులు దగ్గర చేర్చడానికి ఈ జియో ట్యాగింగ్ ద్వారా వారిని సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ నుంచి సుమారు 4,000 మంది సిబ్బంది, టీటీడీ భద్రత, విజిలెన్స్ విభాగం నుంచి 1,300 మంది సిబ్బందిని భద్రతా ఏర్పాట్లలో నియమించారు. గరుడసేవ రోజు మరో 1,200 మందితో భద్రతా ఏర్పాట్లలో ఉంటారని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎప్పటిలాగా భారీ బందోబస్తు ఏర్పాట్లు టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలోన అన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించడానికి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పని చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనే సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 155257 నెంబర్ ఫిర్యాదు చేయాలని టీటీడీ అధికారులు మనవి చేశారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, వారి సహకారం తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు మనవి చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు సరైన సమయంలో అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ అందించాలని, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకునే బాధ్యత మనపై ఉందని, ఆ దిశగా టీటీడీ అధికారులు, సిబ్బంది పనిచేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications