శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా- అరుదైన ఘట్టం..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు వస్తుండటంతో మరింతగా భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తగిన విధంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ జరుగుతోంది. 28వ తేదీన పౌర్ణమి నాడు ఈ సేవ నిర్వహించనున్నారు. అదే విధంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహణకు నిర్ణయించారు. ఇక.. తిరుమలలో ప్రస్తుతం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు రెండో రోజు సోమవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

ఉపరితల ఆవర్తనం - ఈ జిల్లాలకు భారీ వర్షాల పై తాజా హెచ్చరిక..!!
ఉపరితల ఆవర్తనం - ఈ జిల్లాలకు భారీ వర్షాల పై తాజా హెచ్చరిక..!!
ttd-pavitrotsavams-enter-second-day-at-tirumala-devotees-participating-in-the-sacred-rituals-and-s

భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు

కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+