TTD: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, టికెట్ల జారీ పై టీటీడీ తాజా నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి నిర్వహణ పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు జరుగుతుందనే దాని పైన చర్చ జరిగింది. దీని పైన కొందరు స్వామీజీలు టీటీడీకి వినతి పత్రాలు ఇచ్చారు. రెండు రోజులకే పరిమితం చేయాలని సూచనలు చేసారు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న ఘటనల కారణంగా టీటీడీ ఆలోచన చేసింది. ఇక.. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం..టికెట్ల పైన నిర్ణయానికి వచ్చింది.
తిరుమల శ్రీవారి భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 న వైకుంఠ ఏకాదశి రోజున భారీ సంఖ్యలో ప్రముఖులు..భక్తులు తిరుమలకు తరలి రానున్నారు. దీంతో.. సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ కార్యాచరణ ఖరారు చేస్తోంది. 31వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. అయితే, ఈ సారి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ విధానంలోనే టికెట్లు జారీ చేయాలని టీటీడీ భావిస్తోంది. దీనికి సంబంధించి తేదీలను ప్రకటించనుంది. కొంత మొత్తంలో ఆఫ లైన్ లోనే ఇవ్వాలనే ప్రతిపాదన తో.. తుది నిర్ణయం పైన కసరత్తు జరుగుతోంది. ఎక్కడా రద్దీకి అవకాశం లేకుండా టికెట్ల జారీ చేసే విధంగా అధికారులు చర్చలు చేస్తున్నారు.

తిరుమలలో ప్రతీ ఏటా ఈ ఉత్తర ద్వార దర్శనాలు కొన్ని ఏళ్లుగా పది రోజుల పాటు తెరిచి ఉంచు తున్నారు. ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన అపశృతిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తాజాగా శ్రీనివాసానంద సరస్వతీ ఇదే విషయం పైన స్పందించారు. ఎవరైనా వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకో వాలనుకుంటే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే దర్శించుకోవాలని తేల్చి చెప్పారు. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు ఉండదని స్పష్టం చేశారు. దీని పైన ప్రభుత్వంతోనూ టీటీడీ సంప్రదింపులు చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా.. ప్రణాళికా బద్దంగా పండితుల సూచనల మేరకు వ్యవహరించాలని ప్రభుత్వం సూచన చేసింది. దీంతో, భక్తులకు ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పించేందుకు పది రోజులు కొనసాగించాలని నిర్ణయించిన టీటీడీ.. టికెట్ల విషయంలో మాత్రం మార్పులు చేయనుంది.












Click it and Unblock the Notifications