ఏకంగా 12 టన్నుల సరుకు తిరస్కరించిన TTD, అసలు ఏం జరిగింది..!!
తిరుమలలో రద్దీ కొంత తగ్గింది. గత అయిదు రోజులుగా వరుస సెలవులతో భారీగా పెరిగిన రద్దీ ఈ రోజు కొంత మేర తగ్గటంతో దర్శనం వేగంగా అందుతోంది. ఈ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో టీటీడీలో చోటు చేసుకున్న ఆసక్తి కర పరిణామం వెలుగులోకి వచ్చింది. తిరుమల గోడౌన్‌కు చేరుకున్న భారీ మొత్తంలో నాణ్యత లేని 12 టన్నుల జీడి పప్పును టీటీడీ అధికారులు తిరస్కరించారు.
టీటీడీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తిరుమల గోడౌన్‌కు 12 టన్నుల జీడిపప్పు సరఫరా అయింది. గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్ ఈ జీడిపప్పును సరఫరా చేసింది. అయితే, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే ప్రతి ముడిసరుకును ముందస్తుగా పరీక్షించాలనే నిబంధనల ప్రకారం.. టీటీడీ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌లో ఈ జీడిపప్పును నిపుణులు పరీక్షించారు. ఈ ల్యాబ్ పరీక్షల్లో సదరు జీడిపప్పు నిశ్చిత నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ 12 టన్నుల స్టాక్‌ను వెంటనే తిరస్కరించి, వచ్చిన వాహనాల్లోనే వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల మేరకు లేవని గుర్తించారు. దీంతో జీడిపప్పును తిరిగి వెనక్కి పంపించారు.

నాణ్యత పరిశీలన తరువాతే అనుమతి
ఆలయ అవసరాల మేరకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ సహకారంతో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ అందుబాటు లోకి రావటంతో.. ప్రతి నెలా సుమారు 1500 నమూనాలను పరీక్షించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కొవ్వు ఆమ్లాలు, పురుగుమందులు, వాయు వీయ పదార్థాల పరీక్షలు, మైక్రోటాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్‌లు ఇక్కడ పరీక్షించవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రధాన పంటల్లో జీడి ఒకటి. పార్వతీపురం ఐటీఈఏ పరిధిలో 58,146 ఎక రాలు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 46,408 ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి.
టీటీడీకి సరఫరా చేసే జీడిపప్పు నిర్దిష్ట నాణ్యత కలిగి ఉండాలి. పప్పు పరిమాణంతో పాటు గ్రేడింగ్, అలాగే తేమ, జీడిబద్ద, జీడిముక్క ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే సరుకులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం నుంచి తిరుమలకు సరుకు పంపే ముందు స్థానికంగా నాణ్యత పరీక్ష నిర్వహించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో జరిగిన నాణ్యతా పరీక్షల్లో సరుకు తిరస్కరణకు గురైందని చెబుతున్నప్పటికీ ఏ కారణం అనేది స్పష్టత రావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
