తిరుపతిలోనే భక్తుల వాహనాల పార్కింగ్ - క్యూ ఆర్ కోడ్ తో లొకేషన్..!!
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఓ మోస్తారుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దసరా పండగ సెలవులకు మరింతగా రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తు న్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు దర్శన టికెట్లు జారీ చేయగా.. 60 వేల టికెట్లు 10 నిమిషాల్లో పూర్తయ్యాయి. ఇక.. గరుడ వాహన సేవ రోజు న కొండ పైకి వాహనాలు అనుమతించరు. తిరుపతిలోనే పార్కింగ్ కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కాగా.. బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా విడుదల చేసిన రూ 300 టికెట్లకు విశేష స్పందన కనిపించింది. రోజుకు రూ 10 వేల టికెట్ల చొప్పున ఆరు రోజులకు 60 వేల టికెట్లు జారీ చేసారు. పది నిమిషాల వ్యవధిలోనే ఈ టికెట్లు మొత్తం పూర్తయ్యాయి. భక్తులు టీటీడీ నిర్దేశించిన సమయం లో ఈ టికెట్లను అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా సొంతం చేసుకున్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటోంది. బ్రహ్మోత్సవాల తో పాటుగా పెరటాసి మాసం కావ టంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.

బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న జరిగే గరుడ వాహన సేవ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. దీంతో, ఆ రోజున ద్విచక్ర వాహనాలు.. కార్లను తిరుమలకు అనుమతించారు. దీంతో, భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుపతిలోనే అయిదు చోట్ల వాహనాల పార్కింగ్ మైదానాలను ఏర్పాటు చేసారు. ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ల బ్యానర్లను సిద్దం చేసారు. బాలాజీ లింకు బస్టాండ్ లో ద్విచక్ర వాహనాలతో పాటుగా కార్లు, వినాయక సాగర్ క్వార్టర్స్ మైదానంలో కార్లు, నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల మైదానంలో కార్లు, దేవలోక్ పార్కింగ్ మైదానంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తులు వారి వాహన రకాన్ని బట్టి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ లొకేషన్ వెంటనే తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను బ్రహ్మోత్సవాల వేళ రద్దు చేసారు.













Click it and Unblock the Notifications
