TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
తిరుమలలో రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం తరలి వచ్చారు. శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 నుండి 20 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి నుంచి టీటీడీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. సద్గమయ పేరుతో ప్రారంభిస్తున్న ఈ కొత్త పథకంలో భక్తుల నమోదు... దర్శనం గురించి పూర్తి వివరాలను వెల్లడించారు.
టీటీడీ కొత్త కార్యక్రమానికి వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించింది. సద్గమయ పేరుతో భక్తుల కోసం కొత్త కార్యక్రమం మొదలు పెడుతోంది. వైకుంఠ ఏకాది పర్వదినమైన డిసెంబర్ 20 నుంచి ఆన్లైన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రూ.5 చెల్లించి ఆన్లైన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఐదు భాషల్లో రామాయణం, మహా భారతం, భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలు సామాన్య భక్తులకు అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. ఈ సద్గమయ కార్యక్రమంలో పాల్గొనాలను కునేవారు ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో రూ.5 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవా ల్సి ఉంటుందని వెల్లడించారు. దశల వారీగా విదేశాల్లో ఉన్నవారికి ఈ కార్యక్రమం విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

టీటీడీ వినూత్న ఆలోచనలతో
సద్గమయ కార్యక్రమంలో భాగంగా టీటీడీ వినూత్న ఆలోచన చేస్తోంది. ముందుగా టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఇతిహాస పాఠాలకే పరిమితం చేయకుండా.. వాటిపై అవగాహన పెంపొందించేందుకు రోజూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుంది. అంతేకాదు అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురిని లక్కీడిప్ పద్ధతిలో ఎంపిక చేయనుంది. వీరికి కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనం చేసు కునే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ తో భక్తులకు మధ్య సంబంధాలు మరింత గా పెరగటంతో పాటుగా ఇతిహాసాల పైనా అవగాహన పెంచలమే లక్ష్యంగా భావిస్తున్నారు. దీంతో, వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభించే ఈ సద్గమయ కార్యక్రమం పైన టీటీడీ అవగాహన కల్పించే విధంగా కొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది.













Click it and Unblock the Notifications
