TTD: శ్రీవారి దర్శనం, వసతి కోసం భక్తులకు గోల్డెన్ ఛాన్స్..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. జనవరికి సంబంధించిన దర్శనం, వసతి కోటా టోకెన్లను టీటీడీ ఈ రోజు విడుదల చేయనుంది. అదే విధంగా దాతలకు సంబంధించి న కోటాను నేడు అందుబాటులో ఉంచనుంది. తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం అందుతోంది. కార్తీక మాసం ప్రారంభం వేళ..తిరుమలలోని ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
దాతల కోటాలో
తిరుమలలో స్వామివారిని బుధవారం 64,359 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 20,711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.59 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను ( వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి ) అక్టోబరు 24వ తేది ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది.

దర్శనం, వసతి
అదే సమయంలో జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను నేడు (అక్టోబరు 24) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను నేడు (అక్టోబరు 24) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు తిరుమల వెబ్ సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఆర్జితసేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని సూచించారు.
శ్రీవాణి బ్రేక్ కోటా
ఇక, శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం టీటీడీ (TTD) విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేది వరకు టికెట్ల విడుదలను వాయిదా వేశామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు గమనించి ఆ తేదీలను మినహాయించి ఆన్‌లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈవో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications