తిరుమలలో రీల్స్ ఎక్కువయ్యాయ్: టీటీడీ సీరియస్

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 75,303 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,166 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.99 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

TTD warns filming reels near Sacred Tirumala temple

ఈ మధ్యకాలంలో తిరుమలలో రీల్స్ చేయడం ఎక్కువైపోయింది. శ్రీవారి ఆలయాన్ని కూడా వదలట్లేదు. పండగలు, విశేష ఉత్సవాల సమయంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు ఊరేగే అత్యంత పవిత్రమైన తిరుమాడ వీధులను కూడా రీల్స్ కోసం వాడుకుంటోన్నారు.

రీల్స్ కోసం వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. డాన్సులు చేస్తూ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్నారు. వాటిని సోషల్ మీడియా ప్లాట్ పామ్స్ పై పోస్టులు చేస్తోన్నారు. అవన్నీ కూడా తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి వచ్చింది. వాటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం, మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. తిరుమల వంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది.

భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని, తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికింది. తిరుమలలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని, శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించింది.

టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని, తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామనీ హెచ్చరించింది. అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+