TTD: తిరుమలలో అన్నదానంలో వడ్డించే అరుదైన అవకాశం - తాజా నిర్ణయంతో..!!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదం అందుతోంది. ఒక మహా కార్యక్రమంగా శ్రీవారి భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు. టీటీడీ సాధారణ భక్తులకు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కనిపిస్తోంది. భక్తులకు ఒక రోజు అన్నదానంతో పాటుగా .. వడ్డించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

భక్తులకు అవకాశం
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాద ట్రస్టు ఒకరోజు విరాళ పథకం అమలు చేస్తోంది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు రూ.33 ల‌క్ష‌లు ఉండ‌గా, పెరిగిన ధ‌ర‌ల నేప‌థ్యంలో టీటీడీ రూ.38 ల‌క్ష‌లకు పెంచింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

TTD will give options to donors to serve food to devotees and beget Srivari blessings

ఒక రోజు సేవలో
విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందే విధంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4 పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

టీటీడీ నిర్ణయాలు
తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు అందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు చెల్లించాలి. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శించడంతో పాటు దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+