నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.

బుధవారం నాడు 80,048 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 35,403 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

TTD will release Rs 300 special entry tickets for the month of August 2024 today

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఏటీసీ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

కాగా- ఈ ఏడాది ఆగస్టు నెల‌కు సంబంధించి శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. ఈ ఉద‌యం 10 గంట‌లకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటా విడుదల అవుతాయి.

తిరుమ‌ల తిరుప‌తిల్లో శ్రీవారి సేవ కోటా టికెట్లు ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. అదే రోజున మధ్యాహ్నం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, ఒంటిగంటకు ‌పరకామణి సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని బుక్ చేసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు.

TTD will release Rs 300 special entry tickets for the month of August 2024 today

ఇప్పటికే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ సహా వివిధ జేవా టికెట్లన్నీ విడుడల అయిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ ఉద‌యం 10 గంటల నుంచి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను న‌మోదు చేసుకున్నారు. 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ సొమ్మును చెల్లించి టికెట్లను ఖరారు చేసుకున్నారు.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ నాడే ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. అదే రోజున మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటా అందుబాటులోకి వచ్చాయి.

23వ తేదీన‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. అదే రోజున శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్‌లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేసింది. 23వ తేదీన ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు టీటీడీ అధికారులు. అదేరోజున మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌ం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+