మంత్రి ఇల్లు కూల్చలేదేం: గురుకుల్‌పై టీటీడీపీ, కక్ష అని
హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్ నిర్మాణాల కూల్చివేత అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం మండిపడ్డారు. గురుకుల్ ట్రస్ట్‌ను టీటీడీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, నర్సారెడ్డి తదితరులు మాట్లాడారు. ఇదే ప్రాంతంలో మంత్రి మహేందర్ రెడ్డి నివాసం ఉన్నప్పటికీ ఎందుకు కూల్చలేదో చెప్పాలని ప్రశ్నించారు.
గురుకుల్ ట్రస్ట్ భూముల బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చి.. సామాన్యులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఓ విధానం లేకుండా కూల్చడం దారుణమన్నారు. బడాబాబుల ఇళ్ల జోలికి పోని ప్రభుత్వం సామాన్యుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తాము కూల్చివేతలను పరిశీలించినట్లు చెప్పారు.

నిర్మాణాలు జరుగుతున్నంత కాలం చూస్తూ ఉన్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలకు తాము వ్యతిరేకమని, అయితే సామాన్యుల ఇళ్లను కూల్చి బడా బాబుల జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దీని పైనే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అక్రమాలకు ఎవరి పాల్పడినా వారి పైన చర్య తీసుకోవాల్సిందేనని చెప్పారు.
కక్ష సాధింపు: గంటా
నిర్మాణాల కూల్చివేత, భూముల స్వాధీనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా మండిపడ్డారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల పైన తాము కేంద్రం పైన ఒత్తిడి తేలేదన్నారు. చట్ట ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు కేటాయించారన్నారు. ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వమే రీయింబర్సుమెంట్స్ ఇవ్వాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. లేపాక్షి నాలెల్డ్జ్ భూములను తాము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications