అవకాశంలేదు, వెళ్లగొట్టారు!: తుమ్మల, కేబినెట్లోకి ఛాన్స్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుండి తాను వెళ్లేలా చేశారని మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం అన్నారు. ఆయన తత్తుపల్లిలో తన వర్గంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను టీడీపీని వీడేలా చేశారని వ్యాఖ్యానించారు.
పార్టీలో తనను ఇబ్బందులకు గురి చేశారని, తనను కార్నర్ చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. తాను ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీని వీడాలనుకున్నట్లు చెప్పారు.

తాను తీసుకున్న నిర్ణయం బాధాకరమైనప్పటికి తప్పలేదన్నారు. జిల్లాలను అభివృద్ధి చేయాలంటే తనకు పార్టీని వీడటం తప్ప తనకు మరో అవకాశం లేదన్నారు. కాగా, తుమ్మల నాగేశ్వర రావును ఎమ్మెల్సీ చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
తుమ్మల నాగేశ్వర రావు 1982 నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 1983 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1985లో గెలిచారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు.1994, 1999లలో సత్తుపల్లి నుండి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లోను మంతిరగా పని చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications