లేడీ టెక్కీ ఆత్మహత్యయత్నం: మరో టెక్కీ అదృశ్యం

ఈ సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగింది. ముంబైకి చెందిన నేహా (24) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. నాలుగు నెలలక్రితం పుప్పాలగూడకు చెందిన లక్ష్మికాంతరెడ్డి, నేహ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
నెలరోజుల నుంచి వ్యాపారం పేరుతో లక్ష్మీకాంతరెడ్డి మేడ్చల్‌కు మకాం మార్చాడు. శనివారం రాత్రి మోతాదుకు మించి ఆరు మాత్రలు వేసుకోవడంతో అపస్మారకస్థితికి వెళ్లింది. విషయాన్ని గమనించిన స్థానికులు భర్త లక్ష్మికాంతరెడ్డికి సమాచారం అందించడంతో అతను పోలీసుల సహకారంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాజెక్టు పని నిమిత్తం వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం - భువనేశ్వర్‌కు చెందిన మానస రజన్ స్వహిన్-29 అతని భార్య మానసలు గత 15 రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌కు వచ్చారు. ఈ 15 రోజులు రాయల్‌గ్రాండ్ హోటల్‌లో నివాసముంటూ ప్రాజెక్టు పని పూర్తిచేశాడు.
ప్రాజెక్టు పని అయిపోవడంతో భువనేశ్వర్ వెళ్లేందుకు టిక్కెట్లు తెస్తానని భార్యకు చెప్పి శనివారం ఉదయం బయటకు వెళ్లాడు. ఎంతకూ భర్త రాకపోవడంతో భార్య మానస రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications