నల్లగొండ జిల్లా ఎన్‍కౌంటర్‌లో ట్విస్ట్: ఘటనాస్థలిలో రైల్వే టికెట్ లభ్యం
నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎదురు కాల్పుల ఘటన కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు చనిపోగా, దోపిడీ దొంగలుగా చెబుతున్న జకీర్, అస్లాం అనే ఇద్దరు హతమైన విషయం తెలిసిందే.
సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ రైల్వే టికెట్ లభ్యమైంది. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీ నుంచి హైదరాబాదుకు ప్రయాణించిన రైల్వే టికెట్ హతమైనవారి వద్ద లభించింది. దాన్ని బట్టి న్యూఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఓ వ్యక్తి ప్రయాణించినట్లు అర్థమవుతోంది.
కాగా, సూర్యాపేటలో కాల్పులకు పాల్పడిన వ్యక్తులు, శనివారం ఎదురుకాల్పుల్లో మరణించినవారు ఒక్కరేనని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డితో పాటు డిజిపి అనురాగ్ శర్మ చెబుతున్నారు. అయితే, సూర్యాపేట కాల్పులు ఏప్రిల్ 1వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత జరిగాయి. న్యూఢిల్లీ నుంచి ప్రయాణించిన వ్యక్తి 2వ తేదీన వచ్చినట్లు అర్థమవుతోంది. దాంతో మూడో వ్యక్తి ఎవరనే విషయం అర్థం కావడం లేదు.

శనివారంనాటి ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరిలో ఒక్కతను ఢిల్లీ నుంచి వచ్చినవాడైతే మూడో వ్యక్తి ఎక్కడ అనేది ప్రశ్నగా మారింది. సూర్యాపేట ఘటన నుంచి ఇద్దరు తప్పించుకున్నారు.
బుధవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు హైదరాబాదులోనిు చాదర్‌ఘాట్ వద్ద గూడూరు వెళ్లే బస్సు ఎక్కి విజయవాడకు టికెట్లు తీసుకున్నారు. ఆ టికెట్లు కూడా సంఘటనా స్థలంలో లభించాయని అనురాగ్ శర్మ చెప్పారు. అంతేకాకుండా సూర్యాపేటలో పోలీసుల నుంచి ఎత్తుకెళ్లిన గన్ కూడా శనివారంనాటి ఎదురుకాల్పుల ఘటనాస్తలిలో లభించినట్లు మంత్రి నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. దీన్నిబట్టి సూర్యాపేటలో కాల్పులు జరిపి తప్పించుకున్నవారే శనివారంనాడు పోలీసుల చేతుల్లో హతమయ్యారనే నిర్ధారణకు వచ్చారు. కానీ, తాజాగా, రైల్వే టికెట్ మరో ఆలోచనకు తావు ఇస్తోంది.
వారిద్దరినీ కలిసేందుకు మూడో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి ఉంటాడా అనేది అనుమానం. అసలు వారి లక్ష్యం ఏమిటనేది కూడా అర్థం కావడం లేదు. సంఘటనలను పరిశీలిస్తే సూర్యాపేటలో కాల్పులకు పాల్పడినవారు, శనివారంనాడు కాల్పులు జరిపి హతమైనవారు సుక్షితులైన నేరగాళ్లుగా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications