చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ: ఒకరి హత్య?
బళ్లారి: రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి తీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మరణించినట్లు స్థానికంగా వెలుగు చూసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల కథనం ఆధారంగా స్థానిక మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారి ఆ సంఘటన జరిగింది. బళ్లారి నగరంలోని కౌల్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20వ తేదీన ఓ చోట కలిశారు. వీరిలో ఒకతను పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకతను చిరంజీవి అభిమాని.

చిరంజీవి అభిమాని మరో వ్యక్తితో వాదనకు దిగాడు. తమ అన్న మెగాస్టార్‌ను మించిన హీరో ఎవరూ లేరని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. చిరంజీవి అభిమాని పవన్ కల్యాణ్ అభిమానిని ఇనుప రాడ్‌తో కొట్టాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమాని అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications