వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యూటర్ దారుణం: బాత్‌రూంలోకి గర్ల్స్ వెనుక వెళ్లేవాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tutor abuses girls in rooms
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఓ కీచక ట్యూటర్ ఉదంతం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పదకొండు మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడటంతో పోలీసులు నిందితుడు హరీష్‌ను అరెస్టు చేసి నిర్భయ సహా పదకొండు కేసులు నమోదు చేశారు. బాధితులను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పరామర్శించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో బంద్, ఆందోళనలు జరిగాయి.

హరీష్ అరెస్టుతో ఆయన ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. హాస్టల్లో ఉన్నా.. బయట ఉన్నా అతను అమ్మాయిలను వెంటాడేవాడట. అతని బారి నుండి తప్పించుకోవడానికి స్నానాల గదికి వెళ్తే అక్కడకు కూడా వచ్చేవాడట. గదిలోకి వెళ్లగానే గడియపెట్టి పైశాచిక ఆనందం పొందేవాడట. హాస్టల్లో ఉన్న ఓ అమ్మాయని పక్కన పడుకోబెట్టుకొని వేధించేవాడని, రాత్రివేళ్లలో హాస్టల్లో లేని సమయాల్లో కూడా ఏదో సాకు చూపి రప్పించుకునే వాడని కన్నీటి పర్యంతమవుతున్నారు.

కాగా, ట్యూటర్ అఘాయిత్యాలపై శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, గిరిజన, మహిళా సంఘాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపి... నెల రోజుల్లోగా నిందితుడిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.

డిఈవో ఘెరావ్.. ఎంఈవోపై దాడి
జిల్లా విద్యాశాఖాధికారిని విద్యార్థి సంఘాల నాయకులు ఘెరావ్ చేశారు. అత్యాచారం సంఘటన విచారణకు వచ్చిన డిఈవోను ఏనిమిది తాండాలో అడ్డుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న పెద్దవూర ఎంఈవో ప్రభాకర్‌రావుపై గిరిజన సంఘాల నాయకులు చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు మీరే బాధ్యులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈవో, ఎంఈవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

English summary
A tutor in Nalgonda district has sexually abused Eleven girls. The accused Harish has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X