సహజీవనం చేసి, నటిస్తే పెళ్లికి నో అన్నాడు: సాగర్‌లో దూకబోయిన టీవీ నటి
హైదరాబాద్: ఐదేళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్‌లలో నటిస్తున్న ఓ నటి (28) ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పేరు హరిజిత్ కౌర్ అలియాస్ రూప. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ఆమెను రక్షించారు.
ప్రేమ వైఫల్యం కారణంగా మానసిక వ్యథకు గురై ఆమె సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్న తన బంధువు కేవల్ సింగ్‌తో నటి రూప ప్రేమలో పడింది. ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

ఒక దశలో ఆమె సీరియల్స్‌లో నటించకూడదంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లి మాట ఎత్తేసరికి, టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ చేతులెత్తేశాడు. అతనిని ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు రక్షించారు.
రూప సోదరుడిని పిలిపించిన పిలిపించిన లేక్ ఇనస్పెక్టర్ శ్రీదేవి కౌన్సిలింగ్ చేశారు. కేవల్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పేట్ బషీర్ బాగ్ స్టేషన్‌కు కేసును బదలాయించారు. ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడవద్దని పోలీసులు చెప్పారు. కాగా, రూప చంద్రముఖి, ఆటో భారతి, అంతఃపురం, శిఖరం వంటి పలు పాత్రలు పోషించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications