ప్రేమికుడితో ఈ నెల్లోనే ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ నటి పెళ్లి
హైదరాబాద్: పోలీసుల కౌన్సెలింగ్‌తో టీవీ నటి రూపా అలియాస్ హర్‌జీత్ కౌర్‌ను(28) పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిన ఆమె ప్రేమికుడు కేవల్ సింగ్(26).. ఈ నెల 29వ తేదీన సికింద్రాబాదులోని గురుద్వారాలో వివాహం చేసుకునేందుకు అంగీకరించారు.
కేవల్ సింగ్, నటి రూపా సహజీవనం చేశారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి అతను నిరాకరించారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఆమెను రక్షించి... ఇరువురికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. కేవల్ సింగ్ పెళ్లికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.
కాగా, ప్రియుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రముఖ టీవీ నటి రూపా హుస్సేన సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. రూపను కాపాడిన లేక్ వ్యూ పోలీసులు, ఎస్సై శ్రీదేవి రూప సొదరుడని, ఆమె ప్రియుడు కేవల్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి.

రూప అసలు పేరు హరిజిత్ కౌర్. రూప ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్న తన బంధువు కేవల్ సింగ్ ప్రేమించుకున్నారు. ఇరువురు కొన్నాళ్లుగా సహజీవనం చేశారు. అయితే, పెళ్లి విషయానికి వచ్చేసరికి కేవల్ సింగ్ నో చెప్పాడు.
ఆమె సీరియల్స్‌లో నటించకూడదంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లి మాట ఎత్తేసరికి, టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ చేతులెత్తేశాడు. అతనిని ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు రక్షించారు. అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications