లేడీ టీచర్‌ను దూషించిన తెలుగు టీవి యాంకర్ అరెస్టు

హైదరాబాద్: ఓ మ్యూజిక్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఖయ్యూమ్ అలియాస్‌ లోబోను హైదరాబాద్ బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం - శుక్రవారం రాత్రి 9 గంటలకు లోబో తన బైక్‌పై అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు.

పెట్రోల్‌బంక్ సమీపంలో ముందు స్కూటీపై వెళ్తున్న యువతికి తనకు సైడ్ ఇవ్వకపోవడంతో దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అకారణంగా తనను దూషించిన యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే తానో టివి యాంకర్‌నని పోలీసులను దబాయించినట్టు సమాచారం.

TV anchor arrested for abusing teacher

ఇవేమీ పట్టించుకోని పోలీసులు కేసు నమోదు చేసుకుని లోబోను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు చేసిన ఆ మహిళను అభినందించారు. దూషణలు తిన్న మహిళా ఉపాధ్యాయురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు.

వాగ్వాదం సందర్భంగా మహిళ టీచర్‌పై టీవీ యాంకర్ లోబో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అతనిపై మహిళా టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోబోను శనివారంనాడు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+