ఫొటో: టీవీ మెకానిక్ ప్రతిభ, దొంగలను పట్టేయొచ్చు
విశాఖపట్నం: ఓ టీవీ మెకానిక్ తన సృజనాత్మకతకు పని పెట్టి కొత్త పరికరాన్ని ఆవిష్కరించాడు. తమిళనాడుకు చెదిన సెంగిట్టువన్ కొన్నేళ్ల కిందట వచ్చి విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతనిలో మెదిలిన ఓ ఆలోచన ఫలితంగా ఇళ్లలో దొంగలు పడితే సెల్ ద్వారా అలర్ట్ చేసే పరికరాన్ని కనిపెట్టాడు.
అలాగే, ఇంట్లో గ్యాస్ లీకేజీ జరిగితే వెంటనే సెల్ ద్వారా మేలుకొలిపేందుకు కూడా ఆ పరికరం ఉపయోగపడుంది. తాను రూపొందించిన సెక్యూరిటీ మెషిన్ (థెఫ్ట్ డిటెక్టివ్ మెషిన్), గ్యాస్ లీకేజీని పసిగట్టి ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవాలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అతను వివరించాడు.

సెక్యూరిటీ మెషిన్‌లో ఫీడ్ చేసి ఉన్న సర్క్యూట్‌లో ఇంటి యజమాని ఫోన్ నెంబర్, తర్వాత భార్య ఫోన్ నెంబర్‌తో పాటు ఇంటి పక్కన ఉండే వారి ఫోన్ నెంబర్లను ఫీడ్ చేసుకుంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు అనుమానిత వ్యక్తులు కానీ, దొంగలు కానీ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే సెక్యూరిటీ మెషీన్‌లో పొందుపరిచి ఉన్న నెంబర్లకు అప్రమత్తత రింగ్‌టోన్‌తో సమాచారం వస్తుందని అతను చెప్పాడు.
గ్యాస్ లీకేజీ నుంచి ఎలా బయటపడేందుకు అవసరమైన పరికరాన్ని కూడా సెంగిట్టువన్ రూపొందించాడు. దొంగలను సులభంగా పట్టుకునేదుకు, గ్యాస్ లీకేజీ నుంచి తప్పించుకోవడానికి ఈ పరికరాన్ని తన వద్ద ఉన్న సర్క్యూట్‌తో రూపొందించినట్లు చెప్పాడు. దీని తయారీకి ఆరు నెలలు పట్టిందని చెప్పాడు. మీడియా సమావేశంలో అతని సహాయకుడు నాగలింగం కూడా పాల్గొన్నాడు.












Click it and Unblock the Notifications