నిజమే, జాఫర్ అలాంటి ప్రశ్నలడిగితే చంపేస్తా అన్నాను : సునీల్
హైదరాబాద్ : 'టీవి 9 జాఫర్' ఈమధ్య కాలంలో వివాదస్పద యాంకర్ గా ముద్రపడ్డ వ్యక్తి. రాజకీయ నేతలను, సినిమా సెలబ్రిటీలను వివాదస్పద ప్రశ్నలతో ఇరుకునపెట్టాలని ప్రయత్నించడం.. చివరికి అవన్నీ బెడిసికొట్టి జాఫర్ పైనే విమర్శలు వెల్లువెత్తడం జరుగుతూ వస్తోంది. రోజా, సునీల్, ఆనం వివేకా లాంటి పలువురి ఇంటర్వ్యూ సందర్భంగా.. జాఫర్ అడిగిన పలు ప్రశ్నలు వివాదస్పదమయ్యాయి.
తాజాగా జాఫర్ ఇంటర్వ్యూ గురించి సునీల్ పరోక్షంగా ప్రస్తావించడంతో.. విషయం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. 'నేను సీరియస్ అయ్యానంటే.. ఇంటర్వ్యూ చేసినవానరు ఫెయిలనట్లే' అని పరోక్షంగా జాఫర్ గురించి ప్రస్తావించాడు సునీల్. అప్పటి ఇంటర్వ్యూ అంత ప్లాన్ ప్రకారం జరిగింది కాదని, జాఫర్ ప్రశ్నలకు నిజంగానే సీరియస్ కావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

రెగ్యులర్ ప్రశ్నలు కాకుండా.. కొంచెం గట్టి ప్రశ్నలే అడుగుతానని యాంకర్ తనకు ముందుగానే చెప్పాడని, అయితే అతని ప్రశ్నలను అనుసరించే తన సమాధానం కూడా ఉంటుందని చెప్పానని సునీల్ చెప్పుకొచ్చాడు. మామూలుగానే వివాదస్పద ప్రశ్నలతో కార్యక్రమాన్ని హైప్ చేయడానికి ప్రయత్నించే జాఫర్.. ఆరోజు కూడా.. 'మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని ఫీలవుతున్నారా..? అసలు అద్దంలో మొహం చూసుకున్నప్పుడు, హీరోగా మీరు ఫిట్ అని ఎప్పుడైనా అనిపించిందా..? సునీల్ వర్మ కాకపోయుంటే అసలు ఇండస్ట్రీలో నెగ్గుకొచ్చేవారా?' అంటూ ప్రశ్నల దాడి చేశాడు.
దీంతో జాఫర్ ప్రశ్నలకు కాస్త సీరియస్ అయిన సునీల్.. 'ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా' అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. జక్కన్న సినిమా సందర్బంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ గురించి తాజాగా మరో ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు సునీల్. ఆ సమయంలో తాను సీరియస్ అయిన మాట వాస్తవమేనని దాని గురించి ఇలా వివరణ ఇచ్చుకున్నాడు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications