సాయిరెడ్డికి బండ్ల గణేష్ హెచ్చరిక - కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే : చెల్లిని అన్నకి దూరం చేసావ్..!!

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పైన బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో ఫైర్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండంటూ పేర్కొన్నారు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు.. నేను కమ్మ వాణ్ణే.. కానీ, టీడీపీ కాదు సాయిరెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావంటూ హెచ్చరించారు.

Recommended Video

    Bandla Ganesh Warns MP VijaySai Reddy కమ్మవారి జోలికొస్తే | Oneindia Telugu

    జగన్‌కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి...

    ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. తనకు వైఎస్సార్ - జగన్ అంటే గౌరవం ఉందని ..నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రమంటూ బండ్ల గణేష్ తీవ్ర కామెంట్స్ చేసారు. మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లోకి లాగుతున్నావు అంటూ ప్రశ్నించారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో అని సూచించారు. చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకోమని పేర్కొన్నారు. నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైల్‌కు పంపింది.. కమ్మ వారు కాదు అన్నారు.. త్వరలో నువ్వు జగన్‌కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి... ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో కూడా తెలుసు.. అన్నింటికీ సిద్ధపడే ట్వీట్‌ చేస్తున్నాను అంటూ బండ్ల గణేష్ వరుసగా ట్వీట్లు చేసారు.

    పవన్ ఇష్టం.. మీ మంత్రి ఇష్టం

    విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్‌ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు అని హెచ్చరించారు. నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు.. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావూ అంటూ మండిపడ్డారు.. జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు అంటూ సూచించారు.

    తనకు కుల పిచ్చి లేదని.. నా కులాన్ని నేను ప్రేమిస్తాను ..ప్రతీ కులాన్ని గౌరవిస్తాను అంటూ పోస్టు చేసారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు.. అది నీకు మంచిది కాదంటూ హెచ్చరించారు.

    చెల్లిని ఆ అన్నకి దూరం చేసావంటూ

    టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు అంటూ మరో పోస్టులో ప్రశ్నించారు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయమంటూ మరో ట్వీట్ చేసారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది.

    దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ మండిపడ్డారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం.. విశాఖలో దోచుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నవు.. ఇది ప్రపంచానికి తెలుసని పేర్కొన్నారు. వేస్ట్ గాడు.. అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్‌లో బ్లాక్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+