బాద్‌షా బయటకు, వార్ వన్ సైడ్: నెట్లో జగన్ హల్‌చల్
హైదరాబాద్: 'బాద్‌షా బయటకొస్తున్నాడు.. ఇక వార్ వన్ సైడే', 'ఎదురుచూపులు ఫలించాయి. జన సునామీ వస్తోంది'.. ఇలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల పైన సామాజిక వెబ్‌సైట్లలో కనిపిస్తోంది. జగన్‌కు సోమవారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆయన మంగళవారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి విడుదల కానున్నారు. సోమవారం ఆయనకు బెయిల్ వచ్చిన విషయం తెలియగానే సామాజిక వెబ్‌సైట్లు అయిన ఫేస్‌బుక్‌లో చాలా లైక్స్ కనిపించాయి. జగన్ గాట్ బెయిల్, గెట్ రెడీ ఫర్ బ్యాటిల్, బాద్‌షా బయటకు వస్తున్నాడు.. అంటూ వాటిల్లో కనిపించింది.

ఫేస్‌బుక్‌లో పోస్టుల మీద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. షేరింగ్స్, లైక్స్ బాగా కనిపించాయి. జగన్‌కు పలువురు కంగ్రాట్స్ కూడా తెలిపారు. ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న ట్వీట్ చేశారు. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. 'కంగ్రాట్స్ వైయస్సార్‌సిపి. గ్రేట్ విన్!! జగన్‌కు బెయిల్ వచ్చింది' అని ట్వీట్ చేశారు.
జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ
వైయస్ జగన్ విడుదలకు కోర్టు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు వచ్చాక జగన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. సాయంత్రం నాలుగు, ఐదు గంటల మధ్య విడుదలవుతారని చెప్పారు. జగన్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు. కోర్టు తెలిపిన అన్ని ష్యూరిటీలను అందచేసినట్లు చెప్పారు. కాగా, కోర్టుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, బాబాయ్ వివేకానంద రెడ్డి, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.












Click it and Unblock the Notifications