హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విన్స్ డే: ఆకట్టుకున్న కవలల కార్నివాల్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 25 మందికి పైగా కవలలు హాజరుకావడంతో ఈ వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. ఇంతమంది ఒకే వేదికపైకి రావడంతో వేడుకలు ఆకర్షణగా సాగాయి.

జిఎన్ సూర్యప్రకాశ్ -జిఎన్ చంద్రప్రకాశ్, జి అనిత -జి సునిత (కవల అక్కాచెల్లెళ్లు, మలక్‌పేట) కవల అన్నాదమ్ములను వివాహం చేసుకోవడం విశేషం. మారయాజబీన్-మదియా జబిన్ (ఫలక్‌నుమా), సంజన-శివానీ (సికింద్రాబాద్) పాల్గొన్నారు. ట్విన్స్ కార్నివాల్ కార్యక్రమాన్ని జికె ఈవెంట్స్ కృష్ణ నిర్వహించారు. పలువురు కవలలు పాడిన పాటలు అహుతులను ఆకట్టుకున్నాయి.

మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్‌ వారు 1976లో నిర్వహించారు. దీనికి ఒక కథనం కూడా ప్రచారంలో వుంది. మోజెస్‌, ఆరన్‌, విల్‌కాక్స్‌ అనే కవల సోదరులుండేవారట. వారు 1819లో తాము ఉంటున్న ఊరికి ‘ట్విన్స్‌బర్గ్‌' అని పేరు పెట్టారు.

వారిద్దరూ మరో ఇద్దరు అక్కాచెల్లెల్లను వివాహమాడారు. ఇద్దరికీ సమాన సంఖ్యలో సంతానం కలిగారు. విచిత్రమేమిటంటే ఒకేరకమైన వ్యాధితో బాధపడుతూ ఒకే రోజున మరణించారు. బింబ, ప్రతిబింబాలవలే జీవించిన ఈ విచిత్ర కవల సోదరులను కలిపి ఖననం చేశారు. వీరి గౌరవార్ధం 1976 నుండి ప్రతి సంవత్సరం కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ప్రచారంలో ఉంది.

పాటలు పాడుతూ..

పాటలు పాడుతూ..

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు కవలలు పాటల పాడి ఆకట్టుకున్నారు.

కవల సోదరులు

కవల సోదరులు

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. కార్నివాల్‌లో పాల్గొన్న కవల సోదరులు.

ఒకే రకమైన దుస్తుల్లో..

ఒకే రకమైన దుస్తుల్లో..

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. కార్నివాల్‌లో పాల్గొన్న పలువురు కవలలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.

పాటలు పాడుతున్న కవలలు

పాటలు పాడుతున్న కవలలు

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్బంగా పలువురు కవలలు పాడిన పాటలు అహుతులను ఆకట్టుకున్నాయి.

చిన్నారి కవలలు

చిన్నారి కవలలు

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్‌ వారు 1976లో నిర్వహించారు.

ఒకే వేదికపై..

ఒకే వేదికపై..

కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 25 మందికి పైగా కవలలు హాజరుకావడంతో ఈ వేడుకలు కన్నుల పండువలా జరిగాయి.

కవల చిన్నారులు

కవల చిన్నారులు

అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న కవలలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

కవల అక్కాచెల్లెల్లు

కవల అక్కాచెల్లెల్లు

అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఆదివారం జరిగిన ట్విన్స్ కార్నివాల్ అమితంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న కవలలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు.

English summary
Ttwins carnival held at Tyagarayaganasabha in Hyderabad on Sunday, organised by G.K.Events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X