నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులు

నటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే భాను ప్రియ మాత్రం తాను పనిమనిషిని ఓ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నట్లు చెబుతున్నారు. అందువల్లే తనకు బాలిక వయసు తెలియదని వెల్లడించారు.

ఒక వేళ నటి భానుప్రియపై బాలకార్మిక చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తే ఆమెకు రెండేళ్లు జైలు శిక్ష రూ. 50వేలు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే తనకు ఏమీ తెలియదని చెబుతున్న భానుప్రియ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. పనిమనిషిగా ఉన్న మైనర్ అమ్మాయిని భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధించాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Twist in Actor Bhanupriya case: Police arrest girls mother in theft case

మరోవైపు బాలిక సంధ్య తల్లిని చోరీకేసులో పాండీబజార్ పోలీసులు అరెస్టు చేశారు. భానుప్రియకు సంబంధించిన నగలు డబ్బులు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు సంధ్యను లైంగికంగా వేధిస్తుండటంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెపై దొంగతనం కేసు కూడా పెడతామని గత కొద్దిరోజులుగా బెదిరిస్తున్నట్లు బాలిక తల్లి ప్రభావతి చెప్పారు. ప్రభావతి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు పండ్రవాడ గ్రామానికి చెందిన మహిళ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+