హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్: బాయ్‌ఫ్రెండ్స్‌తో వద్దన్నందుకే బీహార్ గర్ల్స్‌ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో ఐదుగురు బీహార్ యువతులపై హాస్టల్ నిర్వాహకులు, అతని స్నేహితులు కలిసి అత్యాచారయత్నం చేశారనే కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతుల బాయ్ ఫ్రెండ్స్‌ను హాస్టల్ నిర్వాహకులు లోపలకు నిరాకరించడంతో మంగళవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుందని చెబుతున్నారు.

యువతులు ఫిర్యాదు చేయగానే పోలీసులు హాస్టల్ నిర్వాహకులను, స్థానికులను విచారించారు. సమాచారం మేరకు.. ఫిర్యాదు చేసిన ఐదుగురు యువతులు మరో ఐదారుగురు బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లేందుకు, హాస్టల్‌కు తీసుకొచ్చి మాట్లాడేందుకు నిర్వాహకుల అనుమతిని కోరారు. దానికి వారు నిరాకరించారు.

అక్కడకు చేరుకున్న బాయ్ ఫ్రెండ్స్ నిర్వాహకులతో వాదనకు దిగారు. ఇరువర్గాలు అర్ధరాత్రి పూట ఘర్షణ పడ్డాయి. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అండగా ఉండేందుకు నిర్వాహకులు తమ స్నేహితులను పిలిపించారు. అయితే, ఉదయం మాత్రం యువతులు తమపై అత్యాచారయత్నం చేశారని నిర్వాహకుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి పూట మగ స్నేహితులతో కలిసి పార్టీకి, సినిమాకు వద్దన్నందుకే ఈ గొడవ జరిగిందని స్థానికులు కూడా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. లేడీస్ హాస్టల్ అయినందున యువకులను తాము హాస్టల్లోకి అనుమతించలేదని దీంతో వారు తమపై దాడి చేశారని, ఉదయం అత్యాచారయత్నం చేశారని ఫిర్యాదు చేశారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. రాత్రి జరిగిన ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే అనుమానంతో వారికంటే ముందే యువతులు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

English summary
Twist in the Owner of one hostel tried to rape five girls in Vanastalipuram of Hyderabad on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X