తనిష్క్ చోరీలో ట్విస్ట్: అసలు దొంగ కిరణ్ కాదు, సాయం

కిరణ్ ఇచ్చిన సమాచారం మేరకు వారు అసలు దొంగ కోసం గాలిస్తున్నారు. తనిష్క్ దుకాణంలో ఉన్న సిసిటివి ఫుటేజిల్లో దొంగకు కుడి చేయి, కుడి కాలుకు పోలియో ఉన్నట్లుగా గుర్తించారు. కానీ కిరణ్‌కు అలాంటివి లేవు. మరికొన్ని ఆధారాలతో అసలు దొంగ కిరణ్ కాదని పోలీసులు గుర్తించారు.
అసలు దొంగకు సాయం చేసిన నేపథ్యంలో కిరణ్ నుండి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని వెనుక పెద్ద గ్యాంగ్ ఏదైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కిరణ్ అసలు దొంగ గదికి వచ్చి వెళ్తుంటాడని గుర్తించారని సమాచారం. అదే గదిలో బంగారాన్ని దాచి పెట్టారు.
మరోవైపు తన కొడుకు కిరణ్ అమాయకుడని, తాము కష్టపడి బతుకుతామని, దొంగతనం తమకు తెలియదని కిరణ్ తల్లి అంతకుముందు వాపోయారు. తన కొడుకుకు ఏమీ తెలియదని, అతడి వెనుక ఎవరో ఉండి ఈ పని చేయించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications