RGV News:క్రైం పై సినిమాలు తీసే నన్నే..క్రైం కేసులో అరెస్ట్ చేస్తారా..?
ఛేజ్ లు, ఎస్కేప్ లు, అండర్ గ్రౌండ్ కి సేఫ్ గా చేరుకోవడం ఎలా అనేది.. అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఆర్జీవీ. దావుద్ ఇబ్రహీం రేంజ్ లో డెన్ ఏర్పాటు చేసుకుని.. ఈ రోజు ఎక్కడ తలదాచుకోవడానికి పోయాడో అని ఏపీ పోలీసులు తలలు పట్టుకునేలా చేశాడు. ఈ సమయంలోనే సినిమా రేంజ్ ట్విస్ట్ లను తలపిస్తోంది ఆర్జీవీ అరెస్ట్ అంశం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదైన విషయం తెలిసిందే.గతంలో వర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులో విచారణ కావాలని గతంలో హైదరాబాద్ కు వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు రాకుండా లాయర్ ను పంపిన వర్మ.. నాలుగు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆరు రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో లాయర్ ను పోలీసుల వద్దకు పంపిన వర్మ.. అదే రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేయించారు.
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్ వర్మకు షాక్ తప్పలేదు. వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. అయితే విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే భయంతో ఈసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విచారణకు రాలేనని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు వర్మ సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టు బెయిల్ తీర్పు ఆధారంగా వర్మపై తదుపరి చర్యలు ఉండే అవకాశముందని భావించారు. కానీ పోలీసులు ఇవాళ వర్మ అరెస్టు కోసం హైదరాబాద్ చేరుకున్నారు.

ఆ టైంకి ఆర్జీవీ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది సమాచారమిచ్చారు. ఎక్కడికైనా పరారయ్యి ఉంటారని పోలీసులు.. తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వర్మకి ట్విస్టులు అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలోనే పోలీసులు కావాలని తన వెంట పడేలా చేసి.. ఆ థ్రిల్ ను ఎంజాయ్ చేస్తున్నాడంటూ.. ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక వేళ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అనంతరం జైలుకు పంపినా.. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని సినిమా తీస్తాడని అంటున్నారు. దొరికితే కిక్ ఏముంది.. దొరక్కుండా అండర్ గ్రౌండ్ కి ఎలా వెళ్లాలో సినిమాల్లో బాగా చూపించిన వ్యక్తికి.. తాను దాక్కోవడం తెలియాదా? అంటున్నారు.
పోలీసులు తనపై థర్ఢ్ డిగ్రీ ప్రయోగిస్తారని.. ముందే గ్రహించి కోర్టును ఆశ్రయించాడు అంటే..భయపడుతున్నాడా..? భయపడుతున్నట్లు సొసైటికి తెలియజేస్తున్నాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతా నా ఇష్టం అనే వ్యక్తి పోలీసులకు దొరకకుండా ఇష్టం వచ్చినట్లు గేమ్స్ ఆడుతున్నాడా అని అనుమానపడొచ్చు. ఎందుకంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రకం ఆర్జీవీ. చుద్దాం పోలీసులకు దొరక్కుండా ఇలా ఎంతకాలం జంప్ అవుతాడో?
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications