ఫేస్‌బుక్‌లో గర్ల్ పేర ఖాతా, అసభ్య వ్యాఖ్యలు (పిక్చర్స్)

విశాఖపట్నం: ఓ యువతి పేరు మీద ఖాతా తెరిచి, ఆ యువతి ఫొటో పెట్టి ఇతరులకు అసభ్యసందేశాలు, ఫొోటులు పంపిస్తున్న రెండు వేర్వేరు కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఆదివారంనాడు ఎడిసిపి వరదరాజులు వెల్లడించారు. విశాఖపట్నంలో ఇద్దరిని అరెస్టు చేశారు.

మల్కాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన స్థానిక యువకుడు పంకజ్ కుమార్ (21) యువతి ఫొటో పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి, దాని ద్వారా ఇతరులకు సందేశాలు, ఫొటోలు పంపించేవాడు. దీంతో యువతి మల్కాపురం పోలీసు స్టేషన్‌లో నిరుడు జూన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో నిందితుడ్ని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదిలావుంటే, ఎంవిపి కాలనీలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమెతో పాటు ట్యూషన్‌లో చదువుతున్న ఓ యువకుడు చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.

Two accused arrested in different cases

యువతి పేరు, ఫొటోతో అసభ్య సందేలాలు, చిత్రాలు పంపించడంతో యువతి తండ్రి నిరుడు నవంబర్‌లో త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. ఆదివారంనాడు నిందితుడిని అదుపులోకి తీసుకుని నిందితుడి నుంచి లాప్‍‌టాఫ్, సెల్ ఫోన్, నెట్ మోడెమ్ స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+