మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుల అరెస్ట్...సొంత అన్న కూడా!

Recommended Video

    మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుల అరెస్ట్...!

    అనంతపురం:జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిపై ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితుల్లో బాలిక సొంత కూడా ఉండటంతో పోలీసులు సైతం దిగ్బ్రాంతి చెందారు.

    ఇటీవల బుక్కరాయసముద్రం మండలం వీరభద్రకాలనీకి చెందిన ఓ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆమె తండ్రి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆ బాలిక నిండు గర్భిణీ అని వైద్యులు తెలిపిన క్రమంలో ఆమె ప్రసవం కూడా అదే ఆస్పత్రిలో జరిగింది. దీంతో బాలిక తండ్రి జరిగిన వారుణం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం లోతుగా విచారణ జరిపారు.

    Two accused Arrests in minor girls rape case...Girls own brother also!

    ఆ క్రమంలో బాలిక గర్భం దాల్చడానికి కారకులైన వారిలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ వెంకట్రావ్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం వీరభద్రకాలనీకి చెందిన బాలిక బాలిక గర్భం ధరించడంలో తమ ఇంటి వద్దనే నివాసమున్న ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు సొంత అన్న కూడా కారణమని, వీరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని డిఎస్పీ వివరించారు.

    నిందితులిద్దరిని నగర శివారులోని గుత్తిరోడ్డులో అరెస్ట్‌ చేశామని చెప్పారు. అనంతరం వారిపై ఫోక్సో, నిర్భయ చట్టం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 31 వరకు నిందితులకు జడ్జి రిమాండ్‌ విధించినట్లు తెలిసింది. భవిష్యత్‌లో జిల్లాలో మరెవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఇలాంటి ఘటనలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ల ప్రభావం యువతపై బాగా ఉందని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+