భర్తకు దూరం, బాయ్‌ఫ్రెండ్‌తో జల్సాలు: ఎరగా వెళ్లి హత్య, దోపిడీ
శ్రీకాళహస్తి: చెన్నైకి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాలో ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ముఠా సభ్యుల్లో ఓ అందమైన మహిళ ఉంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె భర్తకు దూరమై బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జీవిస్తోంది. వీరిద్దరికి మరొకతను తోడయ్యాడు. గత డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాళహస్తిలో జరిగిన హత్య కేసు దర్యాప్తులో ఆ ముఠా గుట్టు రట్టయింది.
చెన్నైకి చెందిన పూంగావన్ విజయన్, సత్య రాఘవన్, సూర్యలు ఒక ముఠాగా చెలామణి అవుతున్నారు. వీరిలో సత్య రాఘవన్ అనే మహిళ జల్సాలకు అలవాటు పడింది. దీంతో వివాహమైన ఆరు నెలలకే భర్తకు దూరమే, బాయ్‌ఫ్రెండ్ పూంగావన్ విజయన్‌తో కలిసి జీవిస్తోంది.
వారిద్దరితో పాటు వారి స్నేహితుడు సూర్య కలసి నిరుడు డిసెంబర్ 22వ తేదీన శ్రీకాళహస్తిలోని ఓ లాడ్జిలో దిగారు. వీరు దిగిన లాడ్జీలోని పక్క గదిలో శ్రీనివాస్ అనే వ్యక్తి దిగాడు. అతనిపై ఆ ముగ్గురు కన్ను పడింది. అతని వద్ద ఉన్న నగలు, బంగారం దోచుకోవాలని పథక రచన చేశారు.

అందుకు సత్యా రాఘవన్‌ను ఎరగా వేశారు. ఆ తర్వాత శ్రీనివాస్‌ను హత్య చేసి, అతని ఉన్న సొమ్మును దోచుకున్నారు. ఈ సంఘటపై దర్యాప్తు జరిపిన శ్రీకాళహస్తి పోలీసులు చెన్నై ముఠా విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. సత్య రాఘవన్‌ను, పుంగావన్ విజయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సూర్య మాత్రం తప్పించుకున్నాడు.
ఈ ముగ్గురిపై చెన్నైలోని పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారులపై లారీ డ్రైవర్లను సత్య రాఘవన్ లోబరుచుకున్నట్లు నటించి, వారి వద్ద ఉన్న సొమ్మును దోచుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications