హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టెక్కీ కిడ్నాప్ యత్నం: ఇద్దరి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Two arrested in techie kidnap attempt case
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను కమిషనర్ సివి ఆనంద్ మంగళవారం మీడియా ప్రతినిధుల ముందు హాజరు పరిచారు. కారు డ్రైవర్‌తో పాటు అతని మిత్రుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అపహరణకు గురైందని తెలిసిన వెంటనే తాము అప్రమత్తయ్యామని, అంతటా గాలించామని ఆనంద్ చెప్పారు. హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇంజనీర్‌పై క్యాబ్ డ్రైవర్, అతని మిత్రుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. కారు చిత్రాన్ని సిసిటివీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను పట్టుకున్నామని ఆనంద్ చెప్పారు.

గుంటూరు జిల్లాకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ గౌలిదొడ్డిలోని హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 18వ తేదీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ చేసుకుని, హాస్టల్‌కు వెళ్లేందుకు నిలబడింది.

ఆ సమయంలో లిఫ్ట్ ఇస్తానంటూ ఓ క్యాబ్ రావడంతో అందులో ఎక్కింది. క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించి, తప్పించుకుని వచ్చింది.

కేసులో ఆధారాలు చాలా ఉన్నాయని సివి ఆనంద్ చెప్పారు. దర్యాప్తు సందర్భంలో చాలా లోపాలు తెలిశాయని, టోల్ గేట్ల నిర్వాహకులు వాహనం నెంబర్లు నోట్ చేస్తే బాగుంటుందని ఆనంద్ అన్నారు. సిసిటీవి ఫుటేజ్‌లో రికార్డు అయిన కారు దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు ఆయన తెలిపారు.

English summary
Police have arrested two accused in lady techie kidnap attempt case at Madapur in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X