ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు పిల్లల మృతి
అనంతపురం/ హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారంనాడు దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో గల ఓ ఇంట్లోకి సమెంట్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించారు. అశోక్ అనే బాలుడు, సాయి అనే అమ్మాయి ఈ ప్రమాదంలో మరణించారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారు తాడిపత్రిలో చేరారు.
గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి తాడిపత్రి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, పెద్ద ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. డ్రైవర్ తాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌లోని దుండిగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. జాగిలాపూర్‌లో ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో మోది హత్య చేయగా, బహదూర్‌పల్లి సమీపంలో మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యారు.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొవిచర్ల సమీపంలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా ఎక్లాస్‌పూర్ గ్రామస్థులుగా గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications