దంపతులను ఢీ కొట్టిన మంత్రి గంటా కారు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కారు ఢీకోని ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. విశాఖ జిల్లా యలమంచిలి మండలం సోమన్నపాలెం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో గంటా కారు బైక్‌పై వెళ్తున్న శ్రీనివాసరావు (ఆర్ఎంపీ వైద్యుడు), ఆయన భార్య లక్ష్మిలను ఢీ కొట్టింది.
బైక్ పై నుంచి పడిపోవడంతో లక్ష్మి తలకి తీవ్రగాయం కావడంతో పాటు వాంతులయ్యాయి. వెంటనే వారిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరింత మెరుగైన వైద్యమందించేందుకు అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నర్సీపట్నంలో వైఎస్ఆర్‌సీపీ సమావేశం
వైఎస్ఆర్‌సీపీ విశాఖపట్నం జిల్లా కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశం సోమవారం నర్సీపట్నంలో జరిగింది. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీడీపీ నేరవేర్చని హామీలు, తుఫాన్ సాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 5న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications