అక్రమ సంబంధం: బావపై కత్తులతో దాడి(పిక్చర్స్)
విశాఖపట్నం: తన సోదరిని కొట్టాడనే కోపంతో బావపై బావమరుదులు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. బైక్‌పై వెళుతున్న బావపై పట్టపగలే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడడంతో కలకలం రేగింది. ఈ ఘటన ఎంవిపి జోన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురంకాలనీ పీతలవీధికి చెందిన డొక్కర గోవింద్ తన ఇంటి ఎదుట వాహనంపై ఉండగా అతడి ఇద్దరు బావమరుదులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపపరిచారు. బావమరిది రమేష్ వేరే మహిళతో తిరుగుతున్నాడన్న విషయంపై గోవింద్ తన భార్యతో బుధవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న బావమరుదులు రమేష్, శ్రీనివాస్ కత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశారు.
చుట్టుపక్కల వారు చేరుకొని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆటోలో పరారయ్యారు. గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన గోవింద్ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బావపై దాడి
తన సోదరిని కొట్టాడనే కోపంతో బావపై బావమరుదులు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు.

బావపై దాడి
బైక్‌పై వెళుతున్న బావపై పట్టపగలే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడడంతో కలకలం రేగింది. ఈ ఘటన ఎంవిపి జోన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

బావపై దాడి
పిఠాపురంకాలనీ పీతలవీధికి చెందిన డొక్కర గోవింద్ తన ఇంటి ఎదుట వాహనంపై ఉండగా అతడి ఇద్దరు బావమరుదులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపపరిచారు.

బావపై దాడి
బావమరిది రమేష్ వేరే మహిళతో తిరుగుతున్నాడన్న విషయంపై గోవింద్ తన భార్యతో బుధవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న బావమరుదులు రమేష్, శ్రీనివాస్ కత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశారు.












Click it and Unblock the Notifications