ఫొటోలు: కొకైన్ సరఫరా, ఇద్దరు నైజీరియన్ల అరెస్టు

హైదరాబాద్: కొకైన్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తొమ్మిది గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం ఉపకమిషనర్ సత్యనారాయణ శుక్రవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన దుతున్ ఎకింగొల వ్యాపార వీసాపై నగరానికి వచ్చి సైనిక్‌పురిలోని శైలి గార్డెన్‌లో ఉన్నాడు.

Nigerian1

కెన్యాకు చెందిన కొలిన్స్ ఒచింగ్ అలియాస్ కోలా యాప్రాల్‌లో నివసిస్తున్నాడు. ఎకింగొల నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు. ప్రముఖులకు కొకైన్ సరఫరా చేస్తుండగా 2011లో పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసు నాంపల్లి కోర్టులో ట్రయల్‌లో ఉంది. ఇతడి నైజీరియన్ పాస్‌పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది.

Nigerian2

కోలా జంట నగరాల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేయడంలో సిద్ధహస్తుడు. 1991లో విద్యార్థి వీసాపై నగరానికి వచ్చాడు. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1995లో కెన్యా వెళ్లిపోయాడు. తర్వాత 1998లో విద్యార్థి వీసాపై మళ్లీ ఇక్కడకు వచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. 2010లో ఎక్సైజ్ పోలీసులు ఐదు గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్‌తో కోలాను అరెస్టు చేశారు. తర్వాత మళ్లీ 2012లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొకైన్‌తో పట్టుకున్నారు.

Nigerian3

జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ పాత మార్గంలోనే నడుస్తున్నారు. బంజారాహిల్స్‌లో ప్రముఖలకు కొకైన్‌ను సరఫరా చేయడానికి కోలా జీవీకే ఎదురుగా ఉన్న రోడ్డు నంబర్ 4లో వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని విచారించగా కొలిన్స్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడిని యాప్రాల్‌లో ఉన్న ఇంటి వద్ద అరెస్టు చేశారు. కోలా నుంచి మూడు గ్రాములు, కొలిన్స్ నుంచి ఆరు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి గోవాకు, అక్కడ నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్టు నిందితులు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+