సినీ యాక్టర్స్, సెలిబ్రిటీలకూ ఫోన్లూ, లెటర్లు: నక్సల్స్ పేరుతో వసూళ్లు
హైదరాబాద్: నక్సలైట్ల పేరుతో ఫోన్లూ చేస్తూ, లేఖలు రాస్తూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకతను తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు కాగా, మరో యువకుడు అనంతపురం జిల్లాకు చెందినవాడు. వీరిద్దరు కూడా బిర్యానీ పాయింట్‌లో వర్కర్లుగా పనిచేస్తున్నారు.
వివరాలు ఈ విధంగా ఉన్నాయి - ఇద్దరు నక్సల్స్ వార్తలను పత్రికల్లో చదివారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నకిలీ నక్సల్స్ అవతారం ఎత్తారు. ఫోన్లు చేసి, లెటర్లు రాసి బెదిరిస్తూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం తోటపేట గ్రామానికి చెందిన పులపాకూరి గణపతి బీకాం వరకు చదివి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఫిల్మ్‌నగర్ క్లబ్ సమీపంలోని జస్ట్ బిర్యానీ పాయింట్‌లో పనిచేస్తున్నాడు. పత్రికల్లో వార్తలు చదివి తేలికగా డబ్బు సంపాదిం చాలంటే నక్సల్స్ అవతారమెత్తాలని భావించాడు.
అనంతపురం జిల్లా కామేకల్‌కు చెందిన కొక్కుల అనిల్ రెడ్డి పదో తరగతి చదివి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు క్యాబ్ డ్రైవర్‌తోపాటు గణపతి పనిచేస్తున్న బిర్యానీ పాయింట్‌లో కౌంటర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి నకిలీ నక్సల్స్ అవతారం ఎత్తారు. సీపీఐ (మావోయిస్ట్), తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో మొదట లెటర్‌హెడ్ తయారు చేయించారు.
ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీనటులు, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయవేత్తలకు పోస్టు ద్వారా లెటర్లు పంపేవారు. లెటర్లు అందిన వారు వీరికి ఫోన్లు చేసేవారు. ప్రముఖులు చేసిన ఫోన్ల ఆధారంగా వీరు తిరిగి ఫోన్లు చేసి ఒకొక్క రిని రూ.20 నుంచి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు.
నిందితులిద్దరినీ సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి నిందితుల నుంచి సీపీఐ మావోయిస్టు లెటర్‌హెడ్ (సూడో), టాటా ఇండికా కారు (ఏపీ28టీవీ7318), మెబైల్ ఫోన్లు-2, రాసిఉన్న సమాచారం, 8 పోస్టల్ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications