తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాసలీలలు: ఎస్వీయూలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు, సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఓ ఉద్యోగి సహచర ఉద్యోగినితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ శృంగార సన్నివేశాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పుటేజీలను పరిశీలించిన అధికారులు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి.

ఎస్వీయూ కో-ఆపరేటివ్ స్టోర్స్ ఇండేన్ గ్యాస్ కార్యాలయంలోని ఓ క్లర్కు అక్కడి స్వీపర్‌తో కార్యాలయంలోనే కొంత కాలంగా రాసలీలలు కొనసాగిస్తున్నాడు. జూన్ 28న కార్యాలయంలోనే రాసలీలలు సాగిస్తుండగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఉద్యోగి వ్యవహారంపై స్టోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

Two SVU employees suspended for romance in office

దీంతో కో-ఆపరేటివ్ స్టోర్స్ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య, మిగిలి న ఆరుగురు డైరెక్టర్ల సమక్షంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. పుటేజీల్లో ఉన్నది స్టోర్స్ ఉద్యోగులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జానకిరామయ్య వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన క్లర్క్ విధుల్లో చేరడానికి అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రాజకీయ ఒత్తిడితో ఆ క్లర్క్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ సస్పెండ్ చేయడం కాదని, విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Two SVU employees suspended for doing sex each other in office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X