Crime News: ఉపాధ్యాయుల ప్రాణం తీసిన ఫొటో షూట్.. గోదావరిలో మునిగి ఇద్దరు మృతి..
ఫొటో సరదా ప్రాణాలు తీసింది. దీపావళి పండుగ వేళ విషాదం నింపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఫొటో షూట్ కు వెళ్లిన ఉపాధ్యాయులు గల్లంతయ్యారు.
జిల్లాలోని కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో వారు ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి తీరానికి వెళ్లారు.
ఈత
ఫోటో షూట్ తర్వాత ఈత కొట్టడానికి బిజూ, టోనీ, ఆంటోనీ గోదావరిలోకి దిగారు. బిజూ, టోనీ నదిలో గల్లంతు అయ్యారు. వారి ఆంటోనీ కాపాడే ప్రయత్నం చేసినా వారిని కాపాడలేకపోయాడు. ఆంటోనీ వెంటనే ఒడ్డుకు చేరి స్థానికులను పిలిచాడు. కానీ బిజూ, టోనీ అప్పటికే నీటిలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఒకరి మృతదేహం లభించగా.. మరో మృతదేహం కోసం గాలింపు సాగుతోంది.

పోలీసుల హెచ్చరిక
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేరళలోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నదీ పరివాహాక ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈత రాని వారు నదులు, చెరువుల్లోకి దిగొద్దని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications