మాది కరెక్ట్!: సమర్థించుకున్న బొత్స, బిల్లు ఎప్పుడో..
హైదరాబాద్: అఖిల పక్ష భేటీలో భాగంగా మంత్రుల బృందం (జివోఎం) వద్ద కాంగ్రెసు పార్టీ వేర్వేరు అభిప్రాయాలు చెప్పడాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సమర్థించారు. విభజన విషయంలో తమ పార్టీకి ద్వంద్వ వైఖరి లేదన్నారు.
కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయాన్ని గౌరవిస్తూనే తాము ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను జివోఎంకు చెప్పామన్నారు. అందులో ద్వంద్వ వైఖరి ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

విభజన బిల్లు, రెండు పిసిసిలు ఎప్పుడు వస్తాయో తనకు తెలియదన్నారు. అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలే చెబుతారని తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే పార్టీ తరఫున విప్ జారీ చేయమన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను తాను రహస్యంగా ఏమీ కలవలేదని చెప్పారు. ఆయనను అధికారిక కార్యాలయంలోనే ఇటీవలి వరద నష్టం పైన కలిసినట్లు తెలిపారు.
కాగా, మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు పార్టీ తరఫున వెళ్లిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనకు అనుకూలంగా, మంత్రి వట్టి వసంత్ కుమార్ సమైక్యాంధ్రకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పారు.












Click it and Unblock the Notifications