కార్తీక స్నానాలకు వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి...
కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతీ ప్రదమైన మాసం. ఈ మాసంలో చాలామంది మహిళలు తెల్లవారుజామునే లేచి నదీ స్నానాలను ఆచరించి, గుడిలో దీపాలు వెలిగిస్తారు. ఇలా చేస్తే సకల దోషాలు తొలిగి కోరిన కోర్కెలు నెలవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. అయితే, కార్తీక మాసం పుణ్యస్నానాల్లో నేడు అపశ్రుతి చోటుచేసుకుంది. కార్తీక మాసం నదీ స్నానాలు చేస్తూ ఇద్దరు మహిళలు మృతిచెందిన సంఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
కార్తీక పుణ్యస్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నదీ స్నానాలు చేస్తుండగా ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ మహిళలు అనకాపల్లి చెందిన వారిగా గుర్తించారు. ఇందులో నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ అనే మహిళలు కసింకోట మండలం జోగారావుపేట గ్రామానికి చెందినవారు. ఈ మహిళలు కార్తీక సోమవారం సందర్భంగా జోగారావుపేట దగ్గర శారదానదికి స్నానాలకు వెళ్లారు.

ఈ క్రమంలో ఈ ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు మహిలు కార్తీక మాసం పుణ్య స్నానాల కోసం నది లోకి దిగారు. అయితే, వారు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు ఆ నలుగురు మహిళల్లో ఇద్దరు మహిళలను రక్షించారు. మరో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ ఉన్నారు. అయితే, పుణ్య స్నానాలకు వెళ్లి మహిళలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ గ్రామం విషాదంగా మారింది.












Click it and Unblock the Notifications