అమ్మాయిని ట్రాప్ చేసి, స్నేహితుడితో కలిసి 10రోజుల పాటు దారుణం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారనికి పాల్పడ్డారు. దీనిపై చింతలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. చింతలపూడి బాలికల హాస్టల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థిని 16వ తేదీన అదృశ్యమైంది.

ఆమెను ట్రాప్ చేసి పది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను ఆమెను నమ్మించి దాదాపు పది రోజుల క్రితం బయటకు తీసుకు వెళ్లాడు. వార్డెన్‌కు చెప్పకుండా వెళ్లింది. ఆమెను బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాధితురాలు ఇంటికి వెళ్లి ఉంటుందని తొలుత వార్డెన్ భావించింది. ఇంటి వద్ద అడిగితే రాలేదని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 21వ తేదీన చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆమెను గుర్తించారు. యువకుడు తనను నమ్మించి తీసుకు వెళ్లి, స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడని చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, దానిని సెల్ ఫోన్లో చిత్రీకరించారు.

Two youth raped girl in West Godavari district

బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం

విజయవాడలో పలుచోట్ల బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు బ్యూటీపార్లర్ అని బోర్డు పెట్టి లోపల అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

విజయవాడలో మసాజ్ సెంటర్లలో అశ్లీల కార్యకలాపాలు సాగుతున్నాయని, పురుషులకు మహిళలతో మసాజ్‌లు చేయిస్తూ, వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు వరుసగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి, నగర పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఇద్దరు మహిళా నిర్వాహకులు, 11 మంది మసాజ్ చేసేందుకు వచ్చిన అమ్మాయిలు సహా, ముగ్గురు యువకులను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు పార్లర్‌లపై కేసులు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+