ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమంటూ కానిస్టేబుల్‌పై దాడి, వీరంగం
అమరావతి: విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద గురువారం రాత్రి దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులమంటూ ఇద్దరు యువకులు ఓ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ట్రాఫిక్ సిగ్నల్ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నెంబరు గల కారును ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆపి పక్కన పెట్టాలని కోరారు.
దీంతో కారులోని యువకులు దుర్భాషలాడుతూ ఆయనతో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ కారును పోలీస్ స్టేషన్‌కు తరలించాలని చెప్పారు. మరింత ఆగ్రహానికి గురైన సదరు యువకులు కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు.

అంతేగాక, తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు యువకులను అదుపులోకి తీసుకుని కారును గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా వారిపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలావుంటే, తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అంతేగాక, తన పేరు వాడుకుని ఎవరైనా దాడులకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని కోరారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications